Geetha Madhuri : టాలీవుడ్ లో సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కీరవాణి, సునీతపై ఆమె చేసిన ఆరోపణలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాజాగా స్టార్ సింగర్ గీతా మాధురి వీడియో రిలీజ్ చేసింది. ‘సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు చూసి చాలా బాధేసింది. ఆమె చాలా మెంటల్ ప్రెషర్ లో ఉంది. ఇప్పటికే ఆమె చాలా కాంపిటీషన్స్ లో పాడింది. కాబట్టి ఆమెపై చాలా మెంటల్ ప్రెషర్ పెరిగి అలా మాట్లాడి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ప్రవస్తి ఒక షోలో గెలవనంత మాత్రాన నీ పని అయిపోయినట్టు కాదు. దాన్ని గుర్తు పెట్టుకో. ప్రతి దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. నీ హార్ట్ లోకి తీసుకుని ఇలా మాట్లాడొద్దు.
Read Also : AjithKumar : పద్మ భూషణ్ అందుకున్న అజిత్ కుమార్..
ఇండస్ట్రీలో గెలుపు, ఓటములు కామన్. అంత మాత్రాన నీకు పాడటం రాదని కాదు. నీకు మేమంతా అండగా ఉంటాం. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్దతు ఇవ్వడానికి మేము రెడీగా ఉంటున్నాం. నాకు తెలిసి కీరవాణి గారు, సునీత, చంద్రబోస్ అయితే ఒకరి చెడు కోరుకునే వ్యక్తులు కాదు. వాళ్లు చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. ఆ షోలో నువ్వు పాడిన పాట వారికి నచ్చలేదేమో. అంతే గానీ నువ్వు నచ్చలేదని కాదు. వాళ్లు ఎంతో మందిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. వాళ్లను చాలా దగ్గరి నుంచి చూస్తూ వస్తున్నాను. కాబట్టి ఇలాంటివి పట్టించుకుని నీ లైఫ్ ను పాడు చేసుకోకు. నీ కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చెయ్. మేమంతా నీకు సపోర్ట్ చేస్తాం’ అంటూ తెలిపింది గీతా మాధురి.