Geetha Madhuri: టాలీవుడ్ సింగర్ గీతామాధురి.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపింది. ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అన్న విషయాన్నీ అధికారికంగా అభిమానులకు తెలిపింది. చిరుత సినిమాలో చమ్కా.. చమ్కా .. చమ్కీరే సాంగ్ తో ఫేమస్ అయిన గీతామాధురి.. జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ గుర్తింపుతో బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి తనదైన ఆటతీరుతో మెప్పించింది. ఇక గీతామాధురి.. నటుడు నందు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇక గత కొన్ని రోజులుగా వీరి మధ్య విబేధాలు తలెత్తాయని, ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్యనే నందు ఈ విడాకుల రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు. తామిద్దరం బిజీగా ఉండడం వలన కలిసి ఫోటోలు దిగలేదని, అంతేకాకుండా తన వర్క్ వలన వేరే చోట ఉండాల్సి రావడంతో అలాంటి పుకార్లు వచ్చినట్లు చెప్పాడు.
ఇక తాజాగా గీతామాధురి.. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభవార్త తెలిపింది. తాను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ భర్త నందు, కూతురు ద్రాక్షాయణితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ద్రాక్షాయణి ప్రకృతి అక్క కాబోతుంది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.