Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మరోసారి సంధికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పారిస్ వేదికగా ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయి్ల ఉన్నతాధికారులు భేటీ అయినట్లు సమచారం. ఈ యుద్ధం వల్ల ప్రపంచశాంతికి భంగం కలుగుతోందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలు వెస్ట్రన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయిల్‌ని కోరుతున్నాయి. మరోవైపు హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని…
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ICJ) ఆశ్రయించింది. తాజాగా గాజా యుద్ధంపై ఐసీజే తీర్పు చెప్పింది. గాజాలో నరమేధాన్ని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇజ్రాయిల్‌ని ఆదేశించింది. గాజాలో ఇజ్రాయిల్ మరణహోమం నిర్వహిస్తోందన్న దక్షిణాఫ్రికా వాదనల్లో కొన్ని ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని ఐసీజే అభిప్రాయపడింది. మానవతా సాయం, అత్యవసర సేవలను అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.
Israel: అక్టోబర్ 7నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై దాడులకు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరింత తీవ్రతరం చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా తుదముట్టించే వరకు వదిలేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వెల్లడించారు. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. మరోవైపు తాజాగా నెతన్యాహూ మాట్లాడుతూ.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేది లేదని స్పష్టం చేశారు.
Benjamin Netanyahu: ఇజ్రాయిల్ తన అన్ని లక్ష్యాలను సాధించే వరకు యుద్ధాన్ని ఆపబోదని మరోసారి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ నాశనం అయ్యేంత వరకు గాజా యుద్ధం ఆగేది లేదని ప్రకటించారు. మూడు నెలల క్రితం హమాస్ మాపై దారుణమైన దాడికి పాల్పడ్డారు, హమాస్ నిర్మూలించాలని, బందీలను తిరిగి తీసుకురావాలని, గాజా నుంచి ఇజ్రాయిల్‌పై మరోసారి దాడులు ఎదురుకావద్దని తాను ఇజ్రాయిల్ ఆర్మీని ఆదేశించినట్లు ప్రధాని నెతన్యాహూ చెప్పారు.
Israel: ఇజ్రాయిల్ అక్టోబర్ 7 నాటి హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత, హమాస్‌ని కుప్పకూల్చాలనే లక్ష్యంలో బిజీగా ఉండగా.. మరోవైపు లెబనాన్ నుంచి హమాస్‌కి మద్దతుగా హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలోని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) స్థావరాలపై రాకెట్ల వర్షం కురిపించారు. శనివారం ఇజ్రాయిల్ సైనిక స్థావరాలపై 60కి పైగా రాకెట్లను ప్రయోగించినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. బీరూట్‌లో హమాస్ డిప్యూటీ లీడర్‌ని హతమార్చినందుకు ప్రతిస్పందనగా ఈ దాడికి పాల్పడినట్లు వివరించింది.
Hamas: హమాస్ ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 7 నాటి దాడి సమయంలో మహిళలపై హమాస్ ఉగ్రవాదులు అత్యాచారాలకు పాల్పడుతూ, వారిని హత్యలు చేశారు. చిన్న పెద్దా, ముసలి వారనే తేడా లేకుండా హత్యలు చేశారు. చిన్న పిల్లల తలలను వేరు చేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఆ దాడి సమయంలో జరిగిన సంఘటనల గురించి ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. సీఎన్ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బందీల్లో ఒకరైన రాజ్ కోహెన్ హమాస్ ఉగ్రవాదుల…
Gaza War : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు నెలలవుతోంది. కానీ ఇప్పటి వరకు శాంతి, స్థిరత్వం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కాల్పుల విరమణ కారణంగా కొన్ని సర్కిల్స్‌లో ఏర్పడిన ఆశ కూడా కాలక్రమేణా ఆవిరైపోయింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హమాస్ ఉగ్రసంస్థను నేలమట్టం చేసేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా హమాస్‌పై పోరుసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలోని హమాస్ కీలక టన్నెల్ వ్యవస్థనున కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ టన్నెల్స్‌ని సముద్ర నీరుతో ముంచేయాలని ప్లాన్ చేసింది.
Israel Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత 74 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు గాజాలో 19 వేల మందికి పైగా మరణించారు. అయితే ఈ యుద్ధం అంత త్వరగా ముగియనుంది.