Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చివరకు నిరాశే ఎదురైంది. ట్రంప్‌ను కాదని వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు కొరినో మచాడోను ‘‘నోబెల్ శాంతి బహుమతి 2025’’ వరించింది. ఆమెకు నోబెల్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
Netanyahu Trump AI Photo: 2025 నోబెల్ శాంతి బహుమతిని ఎవరు అందుకుంటారనేది రేపు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిపై మను మళ్లింది. దీంతో ఆయన ట్రంప్ తనను తాను ఈ అవార్డుకు అర్హుడని భావిస్తున్నారు. సందర్భం దొరికిన ప్రతీసారి ప్రపంచ వేదికలపై ఆయన తాను ఈ పురస్కారానికి అర్హుడని పదే పదే పేర్కొన్నారు. ఈ అవార్డు ప్రకటనకు కేవలం ఒక రోజు ముందు.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి…
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందం కుదరడంపై మోడీ, ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశం-అమెరికా వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.
Israel-Hamas Peace Deal: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన గాజా శాంతి ఒప్పంద ప్రణాళిక మొదటి దశ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ బందీల విడుదలతో పాటు కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణకు అవకాశం ఉంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.