ఈజిప్టు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. గాజా శాంతి శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్-మాక్రాన్ మధ్య ‘ఆర్మ్ రెజ్లింగ్’ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు.. ఏకంగా 738 రోజులు హమాస్ చెరలో బందీలుగా ఉండిపోయారు. తిరిగి వస్తారో.. లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ట్రంప్ ప్రోదల్బంతో గాజా-ఇజ్రాయెల్‌లో శాంతి వాతావరణం నెలకొంది.
Netanyahu: రెండేళ్లుగా సాగుతున్న గాజా యుద్ధం ముగిసేందుకు మార్గం సుగమం అయింది. ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ఒప్పందం’’ కుదిరింది. గాజా శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చారు. ఈ నేపథ్యంలో, గురువారం ప్రధాని నరేంద్రమోడీ, ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
Israel Hamas Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా ట్రంప్ ఫాక్స్ న్యూస్ హోస్ట్ సీన్ హన్నిటీకి ఇచ్చిన ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన నెతన్యాహుతో తన సంభాషణను గుర్తు చేసుకున్నారు. బందీల విడుదల, గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత అందరూ “ఇజ్రాయెల్‌ను మళ్ళీ ప్రేమిస్తున్నారని” ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు…
గాజా స్వాధీనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ను అంతం చేసి బందీలను విడిపించడమే తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ అంటోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. గాజా కాల్పుల విరమణపై యూఎన్ తీర్మానం చేసింది. దీన్ని అమెరికా తిరస్కరించింది.
PM Modi: హమాస్ పొలిటకల్ బ్యూరో నాయకులే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులను ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. దాడిపై విచారం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆందోళన తెలియజేశారు. తాను ఈ విషయమై ఖతాన్ ఎమిర్‌తో మాట్లాడానని, ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించానని, వివాదాలు పరిష్కరించుకోవడానికి చర్చించుకోవాలని పిలుపునిచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు. Read Also: CPL 2025 Robbery: తుపాకీతో బెదిరించి.. ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు!…
గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కూడా చేశారు.
Gaza Ceasefire: ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధానికి బ్రేక్ పడింది. ఇరు వర్గాలు కాల్పుల విరమణ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయిలీ బందీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. హమాస్ తాము విడదల చేయాలని యోచిస్తున్న ముగ్గురు ఇజ్రాయిల్ బందీల పేర్లను ప్రకటించింది. దీంతో గాజాలో కాల్పులు విరమణకు మార్గం సుగమైంది.
ఎట్టకేలకు బాంబు శబ్ధాలకు గాజాలో పుల్‌స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా రాకెట్ దాడులు చేసింది. దీంతో ఆస్తుల ధ్వంసంతో పాటు వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.
Gaza Ceasefire: గాజాలో రెండు రోజుల కాల్పుల విరమణను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా అల్-సిసి ప్రతిపాదించారు. ఈ రెండు రోజులలో, కొంతమంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా నలుగురు ఇజ్రాయెలీ బందీలను మార్చుకునే ప్రతిపాదన చేయబడింది. ఈ విషయాన్ని అబ్దెల్-ఫత్తా అల్-సిసి ఆదివారం నాడు ప్రకటించారు. బందీలను విడుదల చేసిన తర్వాత మరో 10 రోజుల అదనపు చర్చలు కూడా ఈ ప్రతిపాదనలో ఉన్నాయని ఆయన తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ భద్రతా ఏజెన్సీ షిన్ బెట్…