ఈజిప్టు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. గాజా శాంతి శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్-మాక్రాన్ మధ్య ‘ఆర్మ్ రెజ్లింగ్’ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Raju Talikote: విషాదం.. షూటింగ్‌లో ఉండగా కన్నడ హాస్యనటుడు హఠాన్మరణం
గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈజిప్టు వేదికగా ఈ ఒప్పందం జరిగింది. ఇందుకోసం ఆయా దేశాధినేతలంతా పాల్గొన్నారు. ఇక వేదికపై ట్రంప్ ఆయా నేతలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్-మాక్రాన్ మధ్య ఆర్మ్ రెజ్లింగ్ జరిగింది. దాదాపు 29 సెకన్ల పాటు చేతులు పట్టుకుని పట్టుబిగించారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని.. పట్టులను మార్చుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇక మాక్రాన్ కొద్ది సేపటికి వేదిక దిగి వెళ్లిపోయారు. 2017లో కూడా ఇదే మాదిరిగా చేతులు జోడించారు. తాజా సంఘటనతో ఆనాటి దృశ్యాన్ని మళ్లీ జ్ఞాపకం చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఐపీఎస్ పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
దాదాపు రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. 20 మంది బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ 2 వేల మంది పాలస్తీనా ఖైదులను విడుదల చేసింది. అనంతరం ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది.