అనంతపురం జిల్లా శెట్టూరు మండలం, ములకలేడు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రును చికిత్సనిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. ఇవాళ (శనివారం) వేకువజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైనున్న మిద్దె కప్పు కూలి.. నిద్రిస్తున్న వారిపై పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్థులు ఘటనాస్థలానికి…