గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. తాజా సమీక్షలో భాగంగా కమర్షియల్ (వ్యాపార అవసరాలకు) గ్యాస్ సిలిండర్ ధరను రూ.103.50 మేర ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,174కి చేరింది. అటు హైదరాబాద్ మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,278గా నమోదైంది. కాగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం…
వంటగ్యాస్ ధరలు ప్రతినెలా తడిసిమోపెడు అవుతున్నది. అంతర్జాతీయంగా ఇంధనం ధరలు పెరుగుతుండటంతో గ్యాస్ ధరలను పెంచుతూ వస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు గ్యాస్ కు భారీ సబ్సిడీని ఇవ్వడంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, పేదలతో పాటుగా ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలు కూడా గ్యాస్ సబ్సిడీని వినియోగించుకోవడంతో కేంద్రం సబ్సిడీని ఇవ్వడం నిలిపివేసింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం గ్యాస్ ధర రూ.900 పలుకుతున్నది. కాగా, ఇప్పుడు మరోసారి కేంద్రం గ్యాస్ కు సబ్సిడీ ఇవ్వాలని…