ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఈ సందర్బంగా గార్బా డ్యాన్స్ సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి.. తాజాగా ఓ గార్బా డ్యాన్స్ మాత్రం జనాలను కడుపుబ్బా నవ్విస్తుంది.. అందరు రకరకాల డ్రెస్సుల్లో డ్యాన్స్ చేస్తుంటే ఓ ఇద్దరు వ్యక్తులు మాత్రం భయంకరమైన దెయ్యాలుగా తయారై డ్యాన్స్ చేశారు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.. నగరంలో గర్బా సమయంలో,’ అని…
Garba events: నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గర్భా డ్యాన్స్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగాయి. గర్బా నృత్య వేడుకల్లో చిన్నా పెద్దా, యువతీయువకులు పాల్గొంటున్నారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొంటున్న కొందరు గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. గర్బా వేడకలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. అప్పటి వరకు తమ ముందు ఆనందంగా, నవ్వుతూ డ్యాన్స్ చేసిన వ్యక్తులు గుండె పోటుతో మరణించడం చాలా మందిని కలిచివేస్తోంది.
Muslims Boycott Polls In Gujarat Village: గుజరాత్ లో రెండో విడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత డిసెంబర్ 1న పూర్తవగా.. నేడు రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే ఓ గ్రామంలోని ముస్లింలు మాత్రం ఎన్నికలను బహిష్కరించారు.
Man dies while dancing in Gujarat's Dahod: డాన్స్ చేస్తున్న మరో వ్యక్తి గుండె ఆగింది. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు దేశంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. తాజా మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లాలో దేవ్‌గఢ్ బరియా ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
Gujarat: గుజరాత్ రాష్ట్రంలోని తారాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. దుర్గా నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా గార్బా నృత్యం చేస్తూ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలాడు.
Madhya Pradesh Government's key decision to stop Love Jihad: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ యువతులు లవ్ జీహాద్ కోరల్లో చిక్కుకుంటున్నారని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కొంతమంది హిందూ మహిళల్ని ప్రేమ పేరుతో వంచిస్తున్నారని బీజేపీ, హిందూ సంస్థల నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దసరా ఉత్సవాల్లో జరిగే గర్బా డ్యాన్స్ ఉత్సవాలకు వెళ్లేవారిపై నిఘా పెట్టాలని భావిస్తోంది.