Muslims Boycott Polls In Gujarat Village: గుజరాత్ లో రెండో విడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత డిసెంబర్ 1న పూర్తవగా.. నేడు రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే ఓ గ్రామంలోని ముస్లింలు మాత్రం ఎన్నికలను బహిష్కరించారు.
గుజరాత్ లోని ఖేడా జిల్లా ఉంధేలా గ్రామంలో ముస్లింలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. అక్టోబర్ నెలలో ముస్లిం యువకులను పోలీసులు కట్టేసి కొట్టారు. అయితే ఈ ఘటనపై ఆగ్రహంతోనే ఆ గ్రామంలోని ముస్లింలు ఎన్నికలను బహిష్కరించారు. అక్టోబర్ నెలలో దసరా, నవరాత్రి సందర్భంగా గర్భా కార్యక్రమంపై రాళ్లు విసిరారనే ఆరోపణలపై గ్రామానికి చెందిన కొంతమంది యువకునలు పోలీసులు కొట్టారు. పోలీసులు కొంత మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేసి, స్తంబానికి కట్టేసి లాఠీలతో కొట్టారు. సాధారణ దుస్తులతో ఉన్న పోలీసులు, వారిని కొడుతుంటే అదిచూస్తున్న జనాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రజలకు క్షమాపనలు చెప్పాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పోలీసులు ఆదేశించారు.
Read Also: Minister KTR : చెరువు మాయమైందంటూ మంత్రికి ట్వీట్.. అక్కడికెళ్లి చూసి అవాక్కైన అధికారులు
అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై కొంతమంది నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇన్స్టాంట్ జస్టిస్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని తప్పబట్టారు. అయితే మరికొంత మంది మాత్రం పోలీసులకు మద్దతుగా నిలిచారు.
అక్టోబర్ 3న ఉంధేలా గ్రామంలో ఆలయ ప్రాంగణలో జరిగి గర్భా కార్యక్రమంపై 150 మంది గుంపు రాళ్లు రువ్వినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసులో 43 మంది పేర్లు నమోదు అయ్యాయి. ముస్లిం కమ్యూనిటీ సభ్యులు ఆలయం ముందు గర్భా నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. ఆలయానికి ముందు మసీదు ఉండటంతో అభ్యంతరం తెలిపారు. ఆ తరువాత గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో మోహరించి పరిస్థితి చక్కదిద్దారు.