గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు.. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. టీడీపీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందనగా యాక్టివ్ పాలిటిక్స్ ప్రారంభించారు ఈ మాజీ మంత్రి. కానీ.. ఆయన వేస్తున్న అడుగులకు.. క్రియాశీలకంగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీలోని ప్రత్యర్థులు చెక్ పెడుతున్నారు. దీంతో గంటా ప్రతీ కదలిక ఆసక్తిగా మారుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర నుంచి బాదుడే.. బాదుడు నిరసన టూర్ చేపట్టారు. విశాఖ…