టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్‌లో పెట్టిన స్పీకర్.. ఇప్పుడు ఆమోద ముద్ర వేయడంపై గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.
ఏపీలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఇంఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలతో టీడీపీ అధిష్టానం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే చంద్రబాబుతో సమావేశానికి గంటా హాజరుకాలేదు. త్వరలో వచ్చి చంద్రబాబును కలుస్తానని టీడీపీ కార్యాలయానికి గంటా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో రాలేకపోతున్నానని గంటా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. Read Also:…
ఆయనో మాజీ మంత్రి. అధికారంలో లేకపోయినా తనదైన ఎత్తుగడలతో చర్చల్లో ఉంటారు. కొంతకాలంగా హైకమాండ్‌తో దూరం పాటిస్తున్నారు. రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అంచనాలు వినిపించాయి. కానీ.. హఠాత్తుగా యూటర్న్ తీసుకుని ఇప్పుడు మళ్లీ పార్టీకి విధేయత ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఆయనలో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటి? ఎవరా నాయకుడు? రెండేళ్లుగా గంటా రాజకీయ ప్రయాణంపై చర్చ..! గంటా శ్రీనివాసరావు. విశాఖజిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఒక వెలుగు వెలిగారు.…
రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులు దారుణంగా వున్నాయని మండిపడ్డారు టీడీపీ నేతలు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులా? ఇదెక్కడి అన్యాయం..ముఖ్యమంత్రి గారూ ఒక్కసారి ఆలోచించండి అన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రజా సమస్యల దృష్టి మరల్చడానికే ఈ చర్యలా.. !? అని గంటా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య…