కాపుల మధ్య ఐక్యత ఎంతో అవసరం అన్నారు మాజీమంత్రి గంటా శ్రీనివాస్ రావు. రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీలే కాదన్నారు. కాపు నాడు సభను నేను లీడ్ చేస్తున్నామనేది అపోహ మాత్రమే….ప్రతీ కార్యక్రమం అనివార్యంగా రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. దీనికి ఏ నాయకుడు మినహాయింపు కాదు అన్నారు. ఈనెల 26న విశాఖలో కాపునాడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాధా రంగ రీ యూనియన్ ఆధ్వర్యంలో ఏ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో సభ….రంగా జన్మదిన వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also; Aam Admi Party: గుజరాత్‌లో ఆప్‌కి మరో ఝలక్.. బీజేపీకి ఎమ్మెల్యే సపోర్ట్
ఆర్గనైజర్లకు ఒక స్పష్టమైన విధానం ఉంది….అది త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు గంటా శ్రీనివాసరావు. పార్టీ మార్పుపై నేనెప్పుడు మాట్లాడలేదు….నిర్ణయం తీసుకుంటే నేనే ప్రకటిస్తాను….వంగవీటి పేరు సమాజంలో ఓ వైబ్రేషన్ అన్నారు. రంగా ఒక కులానికో……మాతానికో ప్రతినిది కాదు బడుగు, బలహీన వర్గాలు నాయకుడు. దేశ నాయకులతో సమానంగా విగ్రహాలు కలిగిన నేత రంగా. కాపునాడు బహిరంగ సభ విజయవంతం కావాలని గంటా అభిలషించారు. పోస్టర్ రిలీజ్ చిరంజీవి చేతుల మీద జరగాల్సి ఉంది. పద్మశ్రీ సుంకర ఆది నారాయణ మాట్లాడుతూ.. విశాఖలో మూడొంతులు వున్న కాపులు మధ్య ఐక్యత అవసరం అన్నారు. చాపకిందనీరులా పని చేసి నాయకులను గెలిపించుకోవాలన్నారు.
Read Also: Bandi Sanjay: యాగం చేస్తే ఇంట్లో చేసుకోవాలి ఢిల్లీలో కాదు..