తెలంగాణలో సంచలనం కలిగించిన డ్రగ్స్ మరణం కేసుకి సంబంధించి నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ కీలక దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో వెలుగు చూస్తున్న అంశాలు అధికారులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో లక్ష్మీపతి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. లక్ష్మీపతి కోసం మూడు నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గోవా, అరకు, విశాఖ, తణుకులో లక్ష్మి పతి తలదాచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకులతో…
రాష్ట్రంలో మహిళలు, విద్యార్ధినులపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న తీరుపై సీఎం జగన్ కి లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు.రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మకాల వల్లే రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్ తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని లేఖలో…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్థిల్తుతోంది. ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా గంజాయిని అక్రమరవాణా చేస్తూ కేటుగాళ్ళు పట్టుబడుతున్నారు. సంగారెడ్డిలో ప్రొహిబీషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కంది, చేర్యాల గ్రామం ,రుద్రారం,భానూరు, వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయి లభ్యం అయింది. చేర్యాల గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డి , భానూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల నుండి…
గంజాయి అక్రమ రవాణా పెరిగిపోతోంది. ఏ రూపంలోనైనా గంజాయిని తరలిస్తూ అక్రమార్కులు అడ్డంగా బుక్కవుతున్నారు. కొందరు ఇంట్లోనే గంజాయిని పెంచుతూ దానికి బానిసలుగా మారుతున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు సైఫాబాద్ పోలీసులు లకిడికపూల్ రైల్వే క్వార్టర్స్ లో నివసించే మొహమ్మద్ ఆరిఫ్ అలియాస్ టిల్లు 19 సంవత్సరాలు బ్యాండ్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. గంజాయ్ కి అలవాటు పడి దూల్ పేట్ నుంచి గంజాయి కొనుగోలు చేసేవాడు.…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, హెరాయిన్, బంగారం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. కృష్ణా జిల్లాలో మాదకద్రవ్యాలకు అడ్డాగా మారింది నందిగామలోని విజయ టాకీస్ సెంటర్. డ్రగ్స్ మత్తులో యువత జోగుతోంది. ఇటీవలి కాలంలో యువత డ్రగ్స్ మత్తులో చిత్తవుతున్నారు. అక్కడ యువత గంజాయికి బానిసగా మారుతున్నారని స్థానికులు చెబుతున్నారు. డ్రగ్స్ దొరక్కపోతే యువత ఆత్మహత్యలకు పాల్పడతామని వార్నింగ్ లు ఇస్తున్నారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేస్తున్నారు. తమ పిల్లలు డ్రగ్స్ కి బానిసలవుతున్నారని, బ్లేడ్‌తో కోసుకుంటున్నారు.…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మత్తు వేధిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే వుంది. విశాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా అరికట్టే పనిలో నిమగ్నం అయ్యారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించే పనిలో బిజీ అయ్యారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో…
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా కోకైన్, చరస్ తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులతో పాటు వాటిని సేవిస్తున్న మరో నలుగురు యువకులను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు. అరెస్తయిన వారి నుంచి 3లక్షల 16వేల రూపాయల విలువగల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడిగా…
ఏపీలో రికార్డు స్థాయిలో గంజాయి పట్టుబడుతోంది. గంజాయి అక్రమ రవాణాపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గురువారం నాడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద మొత్తంలో గంజాయి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. Read Also: 15 ఏళ్ల కుర్రాడి దారుణం.. యువతిని ఈడ్చుకెళ్లి, గొంతుకోసి…? సుకుమామిడి బ్రిడ్జి…
గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని విశాఖ రేంజ్ డిఐజి రంగారావు చెబుతున్నారు. గత రెండు మూడు వారాలు గా ఇతర రాష్ట్రాల పోలీసులు విశాఖకు వస్తున్నారని, గంజాయి కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నలు చేస్తున్నారని చెప్పారు. స్థానిక పోలీసుల సహకారం తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ నల్గొండ పోలీసులు స్థానిక పోలీసుల సహకారం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. దాని వల్ల ఫైరింగ్ సమస్య తలెత్తిందన్నారు. కేరళ,తమిళనాడు,కర్ణాటక పోలీసుల సైతం వచ్చి నిందితుల…