ప్రస్తుతం విశాఖ, విజయనగరం అటవీ ప్రాంతాల్లోని ఏ పల్లెకు వెళ్లినా తగలబడుతున్న గంజాయి కుప్పలే కనిపిస్తాయి. గంజాయి సాగు, అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ఫలితాలు ఇస్తోంది. వేలాది ఎకరాలలో గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. 214 కేసులు బుక్కయ్యాయి. 546 మందిని అరెస్టు చేశారు. 100కు పైగా వాహనాలను సీజ్ చేశారు. వైజాగ్ ఏజెన్సీ, ఏవోబీలో దాదాపు 15 వేల ఎకరాలలో గంజాయి సాగవుతోంది. ఎకరాకు 1000…
చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసులో ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టుబడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అమెరికా, నెదర్లాండ్స్ నుండి చెన్నై వచ్చిన మూడు పార్శిల్ లో డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మూడు పార్శిల్ లో డ్రగ్స్ దాచి కేటుగాళ్లు పోస్టాఫీసు ద్వారా చెన్నై చిరునామాకు పంపించారు. పార్శిల్స్ స్కానింగ్ లో డ్రగ్స్ సరఫరా తతంగం బయటపడింది. పార్శిల్ పంపిన అమెరికా, నెదర్లాండ్స్ చిరునామాలపై కస్టమ్స్ బృందం…
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీగా గాంజాయి పట్టుకున్నారు పోలీసులు. వైజాగ్ నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్న 45 కేజీల గాంజాయి సీజ్ చేసింది క్రైమ్ టీమ్. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ చింతల్ మెట్ చౌరస్తా లో కాపు చేసారు క్రైమ్ టీమ్ పోలీసులు… ఓ కారును అడ్డగించి తనిఖీలు చేసిన కాప్స్ కారు డిక్కిలో గాంజాయి గుర్తించారు. పోలీసులను చూసి కారును వదలి పారిపోయే యత్నం చేసిన కేటుగాళ్లు. పారిపోతున్న దుండగులను వెంబడించి పట్టుకున్నారు…
గంజాయి వ్యవహారంపై గత కొంతకాలంగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతూనే ఉంది.. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు… పలు ప్రాంతాల్లో గంజాయి పట్టుబట్టడం.. అవి ఏపీకి లింక్‌లు ఉన్నాయనే వార్తలతో ప్రత్యేకంగా గంజాయి నివారణ చర్యలను చేపట్టింది ఏపీ ప్రభుత్వం.. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి.. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ఎస్ఈబీ, పోలీసు శాఖ కలిసి ఇప్పటి వరకు 2,228 ఎకరాల్లో గంజాయి పంటను…
గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. వాటి సరఫరాకు ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు కేటు గాళ్లు.. లారీలు, కార్లు, ఆటోలు, టూ విలర్, చివరకు విమానాల్లో కూడా మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి.. కేజీలు, క్విటాళ్ల కొద్ది గంజాయి దొరికిన సందర్భాలు లేకపోలేదు. అయితే, స్మగ్లర్లు రూట్ మార్చారు.. ఆధునిక యుగంలో అంతా ఆన్‌లైన్ అయిపోయింది.. ఏ వస్తువు కావాలన్నా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఇప్పుడు గంజాయి విక్రయాలు…
తెలంగాణలో మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాద మోపుతున్నారు. అడుగడునా తనిఖీలు, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం నజీరాబాద్ తండాలో ఓ రైతు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్నాడు. దీనిని గుర్తించిన పోలీసులు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్న రైతును అరెస్టు చేశారు. అంతేకాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయింది. రోజురోజు అత్యాధునిక సాంకేతికతతో ప్రంపచం ముందు వెళుతోంది. కానీ.. కొంతమంది యువత మాత్రం మత్తులో చిత్తవుతూ.. వారి జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఏపీలో ఎక్కడ తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి బయటపడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు శాఖ బస్ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లను నిత్యం తనిఖీలు చేస్తూ గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో సైతం మాదకద్రవ్యాల…
పిచ్చి పలు రకాలు అని పెద్దలు అంటుంటారు. కొందరు వ్యక్తులు కూడా పిచ్చిగా ఏదేదో చేసేస్తుంటారు. హైదరాబాద్ నగరంలోని ఓ వ్యక్తి కూడా ఇలాగే పిచ్చి పని చేసి ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌కు చెందిన వెంకటనరసింహశాస్త్రి (53) బేకరీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకు రోజూ నిద్ర పట్టడం లేదని.. ఎన్ని మందులు వాడినా ఫలితం దక్కలేదని.. ఎవరో చెబితే గంజాయి తాగాడు. ఆరోజు నిద్ర మంచిగా…
ఆపరేషన్ పరివర్తన లో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాం. ఈ మధ్య కాలంలో గంజాయి రవాణా ఎక్కువగా ఉంది అని విశాఖ డీసీపీ గౌతమీ శాలి అన్నారు. రూరల్ ఏరియాల్లో భారీగా గంజాయి పట్టుబడుతుంది. నగర పరిధిలో హోటల్స్, లాడ్జిల్లో, వాహన తనిఖీ లు ముమ్మరం చేస్తున్నాం. రెండు వారల్లో 310 బైండొవర్ కేసులు నమోదు చేసాము. ఆపరేషన్ పరివర్తన లో భాగంగా మార్పు కార్యక్రమం ద్వారా గంజాయికి బానిస అయిన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నాము.…
ఏపీలో గంజాయి పట్టివేత నిత్యకృత్యంగా మారింది. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడోచోట భారీగా గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజా మంగళగిరిలో మరోసారి గంజాయి రవాణా తతంగం బయట పడింది. మంగళగిరిలోని కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనఖీ చేస్తుండగా ఓ కారులో 50 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. విశాఖ నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్నారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. అయితే ఈ…