అన్న కోసం కొందరు తమ్ముళ్లు ఏది చేసేందుకైనా సిద్ధపడతారు.. ఆస్తులు త్యాగం చేసేవాళ్లు కొందరైతే.. అన్నపై ఈగ కూడా వాలకుండా చూసుకునేవారు మరికొందరు.. అయితే, జైలులో ఉన్న తన అన్న కోసం ఏకంగా గంజాయి బిస్కెట్లు తయారు చేసి.. అన్నను ములాకత్‌లో కలిసి పరామర్శించి.. తాను తయారు చేసి గంజాయి బిస్కెట్లను అన్నకోసం పంపించి అడ్డంగా దొరికిపోయాడు ఓ తమ్ముడు.. చివరకు అరెస్టై.. అన్న ఉన్న జైలులోనే ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. Read Also: Gujarat…
హైదరాబాద్ లో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రటైంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సభ్యులను హయత్ నగర్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సభ్యులను మధ్యప్రదేశ్ కు చెందిన నరేంద్ర, చంద్రేశ్ లను అదుపులో తీసుకున్నామని తెలిపారు.
భారత్‌లో గంజాయి సాగు చేయడం నిషేధం. భారత్‌లోనే కాదు… ఆసియా దేశాల్లో గంజాయి సాగు చేసినా, తరలించినా, విక్రయించినా, వినియోగించినా నేరమే. కానీ.. థాయ్‌లాండ్ ప్రభుత్వం గంజాయి సాగుతోపాటు, దాని వినియోగాన్ని కూడా చట్టబద్ధం చేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గంజాయి వాడకాన్ని ప్రోత్సహించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిన్నటి నుంచే అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రభుత్వం..…
వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆలోచిస్తున్న ఇద్దరికి తెలుగులో వచ్చిన పుష్ప సినిమా కొత్త ఆలోచనకు ఉత్తేజపరిచింది. దీంతో శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనంను స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలని రాయలసీమకు చెందిన అరటిపండ్ల వ్యాపారులిద్దరూ స్కెచ్ వేశారు. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, అరటిపండ్ల చాటున హైదరాబాద్‌కు తరలించి అడ్డంగా ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. వీరివద్ద నుంచి రూ. 60.18 లక్షల విలువైన 1500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం…
నార్కోటిక్ వింగ్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది.. స్థానిక పోలీసుల సమన్వయంతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తూ డ్రగ్ ఫెడ్లర్ లకు చుక్కలు చూపిస్తోంది ఈ వింగ్.. తాజాగా అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డ్రగ్ ఫెడ్లర్ ఆట కట్టించింది.. డ్రగ్ ఫెడ్లర్ తో పాటు మరో నలుగురు కంజ్యుమర్లను కూడా అదుపులోకి ఈ వింగ్ అదుపులోకి తీసుకుంది. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం నార్కోటిక్ ఎన్ఫోర్సుమెంట్ వింగ్ ను ఏర్పాటు చేసింది… ఈ వింగ్…
హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయిన ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఇటీవలే బిజినెస్ మన్ లు వైద్యులు, ఇప్పుడు తాజాగా ఐ టి ఎంప్లాయిస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ కేసులో ఎవరి ప్రమేయం ఉన ఎంతటి వారినైనా వదిలేది లేదని నగర పోలీస్ బాస్ హెచ్చరించారు నార్కోటిక్స్…
కోవిడ్ టైంలో కొంత మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది అమ్మాయిలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద బయట కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్నారని, డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. ఓచ్చే 10 సంవత్సరాల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎంప్లాయ్ మెంట్ రెండు మాదక…
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఏపీ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలను ధ్వంసం చేసి.. గంజాయి సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా ఏవోబీతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో…
మాదక ద్రవ్యాల సరఫరాపై రాష్ట్ర పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. స్మగ్లర్లు పోలీసుల కళ్ళు గప్పి గంజాయి తరలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన పోలీసులు వారి ప్లాన్లను బ్రేక్ చేస్తున్నారు. తాజాగా భారీగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సైబరాబాద్ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ 55,03,200 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్…
ఏపీలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ గంజాయి సమాచారం వచ్చిన దాడులు చేస్తూ నిందితులును అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం యరజర్ల కొండల్లో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. కీలక సమాచారంతో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించగా 50 లక్షల విలువైన 850 కేజీల గంజాయి అధికారులు పట్టుకున్నారు. గంజాయిని ప్యాకింగ్ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. నగరానికి కూతవేటు దూరంలో భారీగా గంజాయి పట్టుబడడంతో…