తెలంగాణలో మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాద మోపుతున్నారు. అడుగడునా తనిఖీలు, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం నజీరాబాద్ తండాలో ఓ రైతు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్నాడు.
దీనిని గుర్తించిన పోలీసులు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్న రైతును అరెస్టు చేశారు. అంతేకాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.