తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు జోరుగా మొదలయ్యాయి. మండపాల ఏర్పాటు, బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణనాథుల నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546, ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద 4,730, నెక్లెస్ రోడ్ 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5230, హైదరాబాద్ అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు వెల్లడించారు. గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు.…
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామన్నారు. గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం…
Drone Cameras At Ganesh Immersion: నేడు హైదరాబాద్ మహానగరంలో దేదీవ్యమానంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరుగుతోంది.. హైదరాబాద్ మహానగరంలో అనేక రోడ్లు జన సంద్రంతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెక్రటేరియట్, తెలుగు తల్లి రోడ్డులో ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉన్నారు. ఇక మరోవైపు మీడియా కూడా గణేష్ నిమజ్జనాన్ని కవర్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. వీటితోపాటు ప్రజల రక్షణకు సంబంధించి పోలీసుల సెక్యూరిటీ డ్రోన్స్ కూడా ఆకాశంలో నిరంతరం వాటి పని చేస్తున్నాయి. ఎలాంటి…
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రేపు శోభాయాత్ర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాంపల్లి, బేగంబజార్, మోజం జై మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయబోతున్నారు.
Khairatabad Ganesh: ఇవాళ రోజు కావడంతో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అయితే, ఈరోజు రాత్రి 9 గంటలకు ఖైరతాబాద్ మహా గణనాధుడికి కలశపూజ నిర్వహించనున్నారు.
Ganesh Immersion: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పోకనాటి వీధి వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైన కాసేపటికే డీజే సౌండ్ బాక్సుల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీకి చెందిన పాటలు వేయడంపై బి. కొత్తకోటలో పోలీసులు కేసు నమోదు చేశారు.