ఖైరతాబాద్ మహా గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు అర్చకులు.. సీఎం రేవంత్ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు.. దేశంలోనే గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.. ఖైరతాబాద్ గణేశుని కి ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది.. 1 లక్ష నలభై వేల విగ్రహాలు ఈ సారి నగరంలో ప్రతిష్టించారు..…
గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు భక్తులు రెడీ అయ్యారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణనాథులను శుక్రవారం సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ ప్రాంతంలో 14 చెరువులు, వరంగల్‌లో 7 తటాకాలలో నిమజ్జనం జరగనుంది. శోభయాత్ర జరిగే రహదారుల పొడవునా విద్యుత్ లైట్లు అమర్చారు. బారికేడ్లతో పాటు 28 క్రేన్లు, తెప్పలు సిద్ధంగా ఉంచారు. అందుబాటులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. Also Read:USA: “భారతీయుల వల్లే ఉద్యోగాలు…
Khairatabad : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుకల్లో మహిళలు, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నవారిపై షీ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కేవలం ఏడురోజుల వ్యవధిలోనే సుమారు 900 మంది పోకిరీలను షీ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద సంచలనంగా మారింది. షీ టీం దృష్టిలో పడిన వారిలో 55 మంది మైనర్లు కూడా ఉన్నారు. వీరిని కౌన్సెలింగ్‌కు హాజరుపరచగా, పెద్దవారి విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కొంతమందిని కోర్టులో హాజరు పరచే విధంగా…
గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం ట్విన్ సిటీలు సహా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటించింది.
Shraddha Das : సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు. ఈ బెంగాలీ బ్యూటీ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో వచ్చిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని చిన్న మూవీల్లో మెరిసింది. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు లేవు. టీవీల్లో అప్పుడప్పుడు కనిపిస్తోంది. కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తోంది. తాజాగా ఆమె చేసిన పనికి…
చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ విషాద ఘటన జరిగింది.. గంగవరం మండలం చిన్నమనాయనిపల్లి గణేష్ నిమజ్జన సమయంలో చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.. కాకర్లకుంట చెరువులో ఈ ఘటన జరిగింది.. మృతులు అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల భార్గవ్, 26 సంవత్సరాల చరణ్ గా గుర్తించారు పోలీసులు.
Ganesh Immersion: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. PM Manipur Visit: మణిపూర్‌కు ప్రధాని మోడీ.. 2023 తర్వాత ఇదే తొలి పర్యటన మృతులను తూర్పు తాళ్ళు గ్రామానికి చెందిన తిరుమల నరసింహమూర్తి, జి మురళి, ఇమన సూర్యనారాయణ, దినేష్ గా గుర్తించారు.…
Traffic Diversion : నగరంలో గణేష్ నిమజ్జన మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. నేటి (ఆగస్టు 29) నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు వాహన రాకపోకలపై పరిమితులు ఉండనున్నాయి. పోలీసుల ప్రకారం, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో…
దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 వేల మంది హైదరాబాద్…
Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థిని వినాయక చవితి అని కూడా అంటారు. భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి రోజు వినాయకుడు జన్మించాడని చెబుతారు. అందుకే ఏటా ఇదే రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ 27 ఆగష్టున వచ్చింది. అంటే రేపే వినాయక చవితి. వినాయక చవితి వేడుకలు పది రోజుల పాటు జరుపుకుంటారు.