నేడు భైంసా లో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్త్ చేసారు. ఈ నిమజ్జనానికి మొత్తం 500 మంది పోలీసులతో బందోబస్తుతో పాటుగా 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. అదనపు ఎస్పీ తో పాటు ఇద్దరు ఏ ఎస్పీలు 3 డిఎస్పీలు 11 మంది సీఐ లు 36 ఎస్సై లు 251 మంది కానిస్టేబుళ్లు 37 హోంగార్డు లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు అధికారులు. వీటితో పాటు 10 పికెటింగ్…
గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మేయర్ విజయలక్ష్మి, సీపీ అంజనికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ లో జరిగే వేడుకలు ప్రత్యేకమని… అన్ని శాఖలు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశాయన్నారు. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని.. దాదాపు 40 కి పైగా క్రేన్స్ ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసామని తెలిపారు. 19 వేల మంది పోలీస్…
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.. ఇక, ఈ నెల 19వ తేదీన నిర్వహించే గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమర్జనానికి చకచకా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. నిమజ్జన ఏర్పాట్లకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ట్రాపిక్ పోలీసు, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రికల్ తదితర అన్ని…
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, హైదరాబాద్ వినాయక నిమజ్జనంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో.. జీహెచ్‌ఎంసీ.. సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. ఈ ఏడాది నిమజ్జనాలకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ అప్పీల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. రేపు విచారణ చేపట్టనుంది. నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది.…
నిమజ్జనంపై తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పుతో సిటీలో గణేశ్ నిమజ్జనంపై .. గందరగోళం నెలకొంది. నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు నిరాకరించడంతో.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది జీహెచ్‌ఎంసీ. దీనిపై రేపు ఉదయం విచారణ చేపట్టనున్న అత్యున్నత ధర్మాసనం.. ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠరేపుతోంది. ఇప్పటికే ట్యాంక్ బండ్‌లో…
వినాయక నిమజ్జనం అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ వైపే చూస్తారు.. ముఖ్యంగా నిమజ్జన శోభాయాత్ర.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమంపైనే అందరి దృష్టి.. అయితే, ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఉంటుందా? లేదా? అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే మారిపోయింది… వినాయక విగ్రహాల నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).. హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిరాకరిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్…
గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశామని ఆయన వివరించారు. మరొక రోజులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందని… హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్ లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని… హుస్సేన్ సాగర్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామనటం భాగ్యనగర్ గణేష్…
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం పై గందరగోళం నెలకొంది. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సమాలోచనలో పడింది ప్రభుత్వం. ఇప్పటికే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం ఏర్పాట్లు మొదలు పెట్టారు అధికారులు. ట్యాంక్ బండ్ లోనే గణేష్ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలుపుతుంది.పోలీసులు నిమజ్జనంకు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీద నే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉత్సవ సమితి.…
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేసారు. అయితే హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నేడు ఆ ఏర్పాట్లను పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై చేసిన సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయిల్ రన్ నిర్వహించారు అధికారులు. అనంతరం సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక మైన ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టం ని వాడుతున్నాం. అలాగే ట్యాంక్ బండ్ పై ఈ సారి క్రేన్ల…
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ జరిపింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలి. కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని తెలిపింది. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్తితులు కూడా చూడాలి. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందన్న హైకోర్టు… సామూహిక నిమజ్జనంతో…