స్వదేశంలో భారత్ జట్టు ఏడాది కాలంలో రెండు టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్‌కు గురైంది. గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక స్వదేశంలో న్యూజీలాండ్ (0-3), దక్షిణాఫ్రికా (0-2) చేతిలో టీమిండియా వైట్‌వాష్‌లను ఎదుర్కొంది. దాంతో గౌతీపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. అటు మాజీలు, ఇటు అభిమానులు ఏకిపారేస్తున్నారు. గంభీర్ కోచింగ్ శైలిపై అందరూ మండిపడుతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులకు సంబంధించి ఆయనపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు, గంభీర్, జట్టు సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు…