Off The Record: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆ సందర్భంగా మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అందరి దృష్టి ఒక్కసారిగా గజ్వేల్ వైపు మళ్ళింది. కేసీఆర్‌ను తమ దగ్గర్నుంచి పోటీ చేయమంటే.. తమ దగ్గర్నుంచి చేయమని అనేక జిల్లాల వాళ్ళు అడుగుతున్నారని అన్నారు హరీష్‌రావు. అంటే.. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం…
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీసారు.
వైద్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. చివరి స్థానంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్ అంటూ మండిపడ్డారు.
ఆ నాయకుడు బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెర లేపారా? వచ్చే ఎన్నికల్లో పలానా చోటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి? అధిష్ఠానం చెప్పిందా.. లేక ఆయనే అడ్వాన్స్ అయ్యారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీలో ఎంతటి పెద్దవాళ్లయినా సరే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. ఆ అధికారం రాష్ట్ర పార్టీ చేతిలో కూడా ఉండదు. అందుకే ఈ విషయంలో బీజేపీ నేతలు ఎవరూ…
ప్రజలందరికీ అధికార సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని తెలిపారు. రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధి కై రూ.10 కోట్లు మంజూరు చేసుకున్నామని అన్నారు. మన ఊరు-మన బడి కింద 7300 కోట్లు వెచ్చించి, ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో తరగతులు ప్రారంభిస్తున్నామని…
తెలంగాణ కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ కు గజ్వేల్ సిద్దమైంది. ఇప్పటికే ఇంద్రవెళ్లి, రావిర్యాలలో దళితుల సమస్యలపై సభలు నిర్వహించిన కాంగ్రెస్.. సెప్టెంబర్ 17 ను పురస్కరించుకుని… గజ్వేల్ లో సభ ఏర్పాటు చేస్తోంది. లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్. పిసిసి లో కొంత మంది నాయకులు .. గజ్వేల్ లో సభ ఎందుకు… హుజురాబాద్ లో పెడితే ఎన్నికలకు అక్కరకు వస్తుందని పార్టీ నేతలు సూచించారు. అయితే… గజ్వేల్‌లో సభ…
ఆ ఇద్దరూ మనసు మార్చుకున్నారా..? చాలా రోజుల తర్వాత.. గాంధీభవన్ వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేశారా? వచ్చి.. అందరినీ అవాక్కయ్యేలా చేశారా? ఇకపై కలిసి నడవాలని డిసైడ్ అయ్యారా? ఎవరు వారు? ఏమా కథ? చాలా గ్యాప్ తర్వాత గాంధీభవన్‌కు వీహెచ్! తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక కాంగ్రెస్‌లో కొందరు సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నిత్యం ఏదో ఓచోట పార్టీ కార్యక్రమాల్లో కనిపించే వి హన్మంతరావు సైతం గాంధీభవన్‌కు రాలేదు. కానీ..…
ఇందిరా గాంధీ స్ఫూర్తితో గజ్వేల్‌లో దండోరా సభ నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… గాంధీ భవన్లో జరిగిన పీపీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. గజ్వేల్ సభకి సర్వాధికారాలు గీతక్క(గీతారెడ్డి)కే ఉంటాయని.. ప్రతీ గ్రామంలో దండు కట్టి… దండోరా మోగించాలన్నారు. ఇక, గజ్వేల్ సభతో అంతకం కాదన్నారు రేవంత్ రెడ్డి.. గజ్వేల్ కోటను కొల్ల గొడితేనె.. సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు.. కో-ఆర్డినేటర్లు కష్టపడండి.. కష్టపడిన వారికే పదవులు, గుర్తింపు వస్తాయన్నారు. గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని…
సిద్దిపేట జిల్లా : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రేపు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేయనున్నారు.. ఈ సందర్భంగా గజ్వేల్ మండలం అనంతరావు పల్లి లో ఆరు నెలల క్రితం ఉద్యోగం రాలేదని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు కుటుంభ సభ్యులను పరామర్శించనున్నారు వైఎస్ షర్మిల. పరామర్శ అనంతరం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో నిరోద్యోగ దీక్షలో పాల్గొననున్నారు వైఎస్. షర్మిల. అయితే… వర్షం కారణంగా…