రేవంత్, వీహెచ్ మధ్య కయ్యాలకు పుల్ స్టాప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఇద్దరూ మనసు మార్చుకున్నారా..? చాలా రోజుల తర్వాత.. గాంధీభవన్ వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేశారా? వచ్చి.. అందరినీ అవాక్కయ్యేలా చేశారా? ఇకపై కలిసి నడవాలని డిసైడ్ అయ్యారా? ఎవరు వారు? ఏమా కథ?
చాలా గ్యాప్ తర్వాత గాంధీభవన్‌కు వీహెచ్!
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక కాంగ్రెస్‌లో కొందరు సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నిత్యం ఏదో ఓచోట పార్టీ కార్యక్రమాల్లో కనిపించే వి హన్మంతరావు సైతం గాంధీభవన్‌కు రాలేదు. కానీ.. గజ్వేల్‌లో నిర్వహించే దళిత గిరిజన దండోరా సభ.. సన్నాహక సమావేశానికి VH వచ్చారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఏ దండోరా సభలోనూ హన్మంతరావు పాల్గొనలేదు. ఆహ్వానం అందకపోవడంతో సభలకు రాలేదని సన్నిహితుల దగ్గర చెబుతూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు పార్టీ ఆఫీస్‌లో తళుక్కుమన్నారు.
రేవంత్, వీహెచ్ మధ్య కయ్యాలకు ఫుల్‌స్టాప్!
మీటింగ్‌కు రావడంతోనే తన మార్క్ ఏంటో రుచి చూపించారు వీహెచ్. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం పెడితే అన్నిపార్టీల నాయకులు వెళ్తున్నారని చెప్పిన ఆయన.. సొంత పార్టీలోని ఓ కీలక నాయకుడికి లేఖ రాసినా స్పందించలేదని వాపోయారు. దీనికి రేవంత్ స్పందించాలని పట్టుపట్టారు. చివరకు గజ్వేల్ సభలో .. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని తీర్మానం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం విగ్రహం పెట్టకపోతే కాంగ్రెస్‌పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు కూడా. గాంధీభవన్‌కు వచ్చిన VHని ఈ విధంగా రేవంత్ కూల్ చేశారని చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మధ్య అనారోగ్యంతో VH ఆస్పత్రిలో చేరగా.. పరామర్శించడానికి రేవంత్ వెళ్లారు. ఆస్పత్రి బెడ్‌పై ఉండి కూడా పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం గురించే VH ప్రస్తావించారట. ఇప్పుడు ఆ మాటకు ప్రాధాన్యం ఇవ్వడంతో రేవంత్, VHల మధ్య కయ్యాలకు ఫుల్‌స్టాప్ పడిందని ప్రచారం జరుగుతోంది.
మీరు అలిసిపోతే అండగా ఉంటానన్న జానా..!
ఇక పెద్దలు జానారెడ్డి కూడా గాంధీభవన్‌కు వచ్చారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఇప్పుడే గాంధీభవన్‌కు వచ్చి.. కేడర్‌కు ఓ సంకేతం ఇచ్చి వెళ్లారు. పార్టీ సమావేశాలకు రావడం లేదని అనుకోకండి.. మీరు అలిసిపోయి.. సాయం కోసం ఎదురు చూసే సమయంలో వచ్చి అండగా నిలబడతా అని హామీ ఇచ్చారు జానా. రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించిన సమయంలో పార్టీలోని సీనియర్లు వ్యతిరేకించినా.. కొత్త సారథికి సపోర్ట్ చేశారు జానారెడ్డి. కానీ.. పార్టీ సమావేశాలకు, సభలకు రాకపోవడంతో ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే చర్చ మొదలైంది. ఈ విషయం పెద్దాయన చెవిన పడిందో ఏమో.. గాంధీభవన్‌కు వచ్చి.. సమావేశంలో పాల్గొని వెళ్లారు. తన మనసులో ఏముందో క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి.
గజ్వేల్ సభకు సీనియర్లను రప్పిస్తారా?
గజ్వేల్ దండోరా సభలో కాంగ్రెస్ సీనియర్లను ఒకే వేదిక మీదకు తీసుకురావాలని రేవంత్ చూస్తున్నారట. ఇప్పుడు సన్నాహక సమావేశానికి వీహెచ్, జానా రావడంతో సారథి కొంత సక్సెస్ అయ్యారని టాక్. మిగతా సీనియర్లకు ఒక సందేశం పంపారని చర్చ జరుగుతోంది. మరి.. గజ్వేల్ సభకు ఎంతమంది సీనియర్లు వస్తారో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్‌ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..