Road accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గోనుపాడు సమీపంలోని పర్చర్లమిట్ట వద్ద శనివారం ఉదయం వేగంగా వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని దౌదర్ పల్లి వాసులుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలిపారు. పాతబట్టలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే వీరు గద్వాల నుంచి కర్ణాటకలోని రాయచూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం అనంతరం బొలెరో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ కూడలి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, అజాగ్రత్త నలుగురి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన ఎమిలిపురం సత్తిబాబు స్థానిక శ్రీసాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి దివ్య, అర్జున్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూన్ 2న దివ్య వివాహం నిశ్చయించడంతో ఇరుగుపొరుగు వారి స్నేహితులతో కలిసి గండిపేటలోని ఓషన్ పార్కుకు వెళ్లారు. నిజాంపేటకు చెందిన బైక్ మెకానిక్ ప్రసాద్ డ్రైవర్. కారులో ఏడుగురు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ డ్రైవర్‌తో పాటు 12 మంది ఎక్కారు. ఖానాపూర్ గ్రామం దాటిన తర్వాత ఓషన్ పార్క్ వైపు వెళ్తున్న కారు ఎదురుగా ఉన్న బస్సును ఓవర్ టేక్ చేసి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు పోలీసులు అంచనా వేశారు. ఈ ప్రమాదంలో అంకిత, అర్షిత, నితిన్ అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను మెహిదీపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా తాటి అమృత్ మృతి చెందాడు. వాహనం నడిపిన ప్రసాద్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రదీప్ కుమార్, అర్జున్ పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.
NTR 31: ఇది కదా మావా… ఫాన్స్ కి కావాల్సిన అనౌన్స్మెంట్