ఐటీ రాజధాని హైదరాబాద్, గచ్చిబౌలి లో సరికొత్త షోరూమ్ ద్వారా తన రిటైల్ బ్రాండ్ విస్తృతిని పెంచుతున్న ఆర్.ఎస్. బ్రదర్స్ ! ఆర్.ఎస్. బ్రదర్స్ మరో మైలురాయిని అధిగమిస్తోంది. నవంబర్ 27వ తేదీనాడు తన 16వ షోరూమ్ ను హైదరాబాద్ గచ్చిబౌలిలో శుభారంభం చేస్తోంది. పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి, ప్రసాద్ రావు, దివంగత పి. సత్యనారాయణ స్థాపించిన ఈ సంస్థ తన విజయవంతమైన రిటైల్ ప్రస్థానంలో ఒక విశిష్టమైన బ్రాండు గా చరిత్ర సృష్టించి. అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించే వైవిధ్యభరిత వస్త్రశ్రేణితో షాపింగ్ ప్రియుల ఏకైక గమ్యంగా ఆవిర్భవించి, సాటిలేని వెరైటీలను సరసమైన ధరలకు అందిస్తూ నగరవాసుల విశ్వసనీయతను చూరగొంటూ, వారి హృదయాలకు మరింతగా చేరువయింది.
Also Read:Mangli: మంగ్లీపై అసభ్యకర వ్యాఖ్యలు.. మేడిపల్లి స్టార్ అరెస్ట్..
పాపులర్ స్టార్ మీనాక్షి చౌదరి గచ్చిబౌలిలో ఆర్.ఎస్. బ్రదర్స్ షోరూమ్ శుభారంభానికి ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. కుటుంబంలోని అన్ని తరాలవారి అవసరాలను ప్రతిబింబిస్తూ, వివాహవేడుకలకు అవసరమైన కొనుగోళ్లు గమ్యంగా, సర్వాంగనుందరంగా ముస్తాబైన 16వ షోరూమ్ శుభారంభంలో పాలుపంచుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
RSB Retail India Ltd సంస్థ డైరెక్టర్లు, కొనుగోలుదార్ల పట్ల తమ అంకితభావం గురించి ప్రస్తావిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా గచ్చిబౌలీ షోరూమును తీర్చిదిద్దడం తమ అదృష్టంగా, ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నామని అన్నారు. సంప్రదాయాన్నీ, సరికొత్త ఫ్యాషన్లనూ మేళవిస్తూ ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన వెరైటీలను, సరిసాటిలేని డిజైన్లను ఫ్యాషన్ ప్రియులకు అందుబాటులో ఉంచుతున్నామని తెలియజేశారు.
సంస్థ Chairperson & Whole-Time Director, శ్రీ పొట్టి వెంకటేశ్వర్లుగారు అతిథులకు స్వాగతం పలుకుతూ, “ప్రతీకొత్త సోరూమ్ ద్వారా పర్వదినాలకు, పెళ్లివేడుకలకు అచ్చంగా సరిపోయే ఫ్యాషన్లతో, డిజైన్లతో మా కస్టమర్ల హృదయాలకు చేరునవుతున్నాం. గచ్చిబౌలి ప్రాంతానికి మీ హృదయాల్లో సుస్థిరస్థానం ఉంది. అందరికీ ధన్యవాదాలు” అన్నారు.
Managing Director. శ్రీ ఎస్. రాజమౌళి మాట్లాడుతూ “భారతదేశవ్యాప్తంగా విస్తరించిన సంప్రదాయాల్ని, ఫ్యాషన్లను, వస్త్రాభిరుచుల్ని మేళవించి గచ్చిబౌలి షోరూములో కొలువుదీర్చాం. కళ్యాణమండపంలో కళకళలాడే వధూవరులకు కావలసిన వ్యస్త్రాలంకరణ కోసం ఈ గచ్చిబౌలి షోరూముకు విచ్చేయండి” అంటూ కొనుగోలుదార్లకు స్వాగతం పలికారు.
Whale-Time Director శ్రీ తిరువీధుల ప్రసాదరావు తమ ప్రసంగంలో తమ అభిమాన కొనుగోలుదారుల స్ఫూర్తితో తమ సంస్థ ప్రమాణాలు ముమ్మాటికీ సమున్నత స్థాయికి చేరుకుంటున్నాయన్నారు. నాణ్యత, ధరలు, వెరైటీల విషయంలో తమ హామీని నిలబెట్టుకుంటూ అందరి అవసరాలనూ నెరవేర్చే వైవిధ్యభరితమైన వస్త్రాలను ఒకేచోట అందుబాటులో ఉంచామన్నారు.
Also Read:Weather Report : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ఆందోళన!
గచ్చిబౌలి ఆర్.ఎస్. బ్రదర్స్ షోరూములో మెన్స్ వేర్, కిడ్స్ వేర్ సరసమైన ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా సంప్రదాయం మొదలుకుని సరికొత్త వెరైటీ పట్టుచీరలకు ఆర్. ఎస్. బ్రదర్స్ పెట్టింది పేరు! పర్వదినాలకు, పెళ్లివేడుకలకు అవసరమైన అత్యంత ఖరీదైన కంచిపట్టుచీరలు మొదలుకొని డిజైనర్ లెహంగాలు, పండగ కుర్తాలు, వెస్ట్రన్ వెరైటీలు, కిడ్స్ వేర్ ఆర్.ఎస్. బ్రదర్స్ గచ్చిబౌలిలో లభిస్తున్నాయి. కుటుంబంలోని అన్ని తరాలవారినీ అందుబాటు ధరల్లో అలరిస్తున్నాయి.