Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో 15 బైకులు దగ్ధం.!
- గచ్చిబౌలిలో అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో అగ్నిప్రమాదం
- ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ప్రారంభం
- 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం
- అపార్ట్‌మెంట్ అంతా దట్టమైన పొగ
- పొగ పీల్చడంతో ఇద్దరు నివాసితులకు అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టిఎన్జీవో కాలనీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ప్రాణనష్టం తప్పింది.
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ప్రాథమిక సమాచారం ప్రకారం, అపార్ట్‌మెంట్ సెల్లార్ లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు మొదలయ్యాయి. సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలకు ఈ మంటలు వేగంగా అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే అపార్ట్మెంట్ అంతా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. పొగ కారణంగా పై అంతస్తుల్లో ఉన్న నివాసితులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఈ అగ్నిప్రమాద ఘటనలో సెల్లార్ లో పార్క్ చేసిన సుమారు 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పొగ పీల్చడం వల్ల అపార్ట్మెంట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే గచ్చిబౌలి ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ లోపల చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. నిచ్చెనల సాయంతో పై అంతస్తుల నుంచి బాధితులను సురక్షితంగా కిందకు దించారు. అగ్నిమాపక యంత్రాలతో నీటిని చల్లి మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు అపార్ట్‌మెంట్ వాసులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!