Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏఎంబీ (AMB) ఫ్లైఓవర్‌పై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్ ప్రయాణం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం వేళ గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్ వెళ్తోంది. అదే సమయంలో హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపునకు ఒక స్కూటీ ఫ్లైఓవర్‌పై నిబంధనలకు విరుద్ధంగా, రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చింది. ఫ్లైఓవర్‌పై వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంతో, ఊహించని విధంగా ఎదురైన స్కూటీని బుల్లెట్ బైక్ చాలా బలంగా ఢీకొట్టింది.
ఈ తీవ్రమైన ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్‌తో పాటు అతని వెనుక కూర్చున్న విఠల్ అనే వ్యక్తి రోడ్డుపై పడిపోయారు. తల, ఇతర భాగాలకు తీవ్రమైన గాయాలు కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతున్న వినోద్ అనే యువకుడికి అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
తాజావార్తలు
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!