Rajnath Singh: మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని ఆర్మీ వార్ కాలేజీలో బుధవారం నిర్వహించిన త్రివిధ దళాల ఉమ్మడి సింపోజియం ‘రణ్ సంవాద్ 2025’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో యుద్ధాలు ఎలా జరుగుతాయో వివరించారు. భారతదేశం ఎప్పుడూ ముందుగా దాడి చేయదని, కానీ సవాలు చేస్తే దానికి పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ భద్రత ఇకపై కేవలం సైన్యం విషయం కాదని, అది మొత్తం దేశం…