Petrol-Diesel Prices: ముడి చమురు ధరలు తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇంధన ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరలు జనవరి 2024 నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇది చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) లాభదాయకతను మెరుగుపరిచింది. దీంతో ఇది వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు అవకాశం ఏర్పడింది.
అధిక ఇంధన ధరలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. రెండేళ్ల సూచన వ్యవధిలో ఇంధన ధరలు తగ్గిన ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం అని అన్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో పూరీ మాట్లాడారు.
Fuel prices: పెట్రోల్-డిజిల్ ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. దేశీయంగా ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి హింట్ ఇచ్చారు. నాలుగో త్రైమాసికింలో చమురు మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి వస్తే దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని శుక్రవారం ఆయన చెప్పారు.
Fuel Prices: గత కొంత కాలంగా కేంద్రం పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గిస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీటిన్నింటిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ప్రస్తుతమైతే ట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రతిపాదన లేదని ప్రభుత్వం బుధవారం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో అస్థిరత ఎక్కువగా ఉన్నందు వల్ల ప్రస్తుతం కేంద్రానికి అలాంటి ప్రతిపాదన లేదని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఇంధన ధరల తగ్గింపుపై మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలే…
IMF: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచం రెండుగా చీలి ఇరు వైపుల పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ యుద్ధం ఎలా ప్రభావితం చేస్తుందో అని ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న వేళ ఇప్పుడు ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్య ప్రపంచం ముందు నిలిచింది.
ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఇంధన ధరలు తగ్గుతాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇది మీడియా ప్రచారం అని, అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.
ప్రధానంగా ఆహార ధరల తగ్గుదల కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 25 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతానికి పడిపోయింది. రీటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదల ఆర్థికవేత్తలు అంచనా వేసిన దానికి అనుగుణంగానే ఉంది.
ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలపై మరో బాంబు పేలింది. ఆ దేశ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది.
కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చాలా రోజుల తర్వాత మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 17 పైసలు, లీటర్ డీజిల్పై 16 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.66కి చేరింది. అటు లీటర్ డీజిల్ రూ.105.65కి ఎగబాకింది. New Rule: అలర్ట్.. పాన్ కార్డు వాడే వారికి కొత్త రూల్ అయితే దేశ రాజధాని ఢిల్లీలో…