Petrol-Diesel Prices: ముడి చమురు ధరలు తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇంధన ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరలు జనవరి 2024 నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇది చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) లాభదాయకతను మెరుగుపరిచింది. దీంతో ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు అవకాశం ఏర్పడింది.
Read Also: Bangladesh: పాకిస్తాన్‌తో 1971 సమస్యల పరిష్కారానికి బంగ్లాదేశ్ సిద్ధం..
మరోవైపు అమెరికాలో మాంద్య భయాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్రెంచ్ క్రూడ్ తక్కువగా ట్రేడ్ అవుతోంది. బుధవారం, అమెరికా ముడి చమురు ధరలు 1% పైగా పడిపోయాయి, బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా 1 డాలర్ తగ్గి బ్యారెల్‌కు 72.75 డాలర్‌కి చేరాయి. బ్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం బ్యారెల్‌కి 73.17 డాలర్లుగా ఉంది. మరోవైపు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చివరి సారిగా సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ ధరలను లీటర్‌కి రూ. 2 తగ్గించింది.