మాదాపూర్ దుర్గం చెరువు కాలనీవాసులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. నాలుగు నెలల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా నిర్మాణాలు వచ్చాయంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది.
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని ప్రకటించారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే వాటిని హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్‌లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు.
హైడ్రా బ్రెయిన్ స్టోర్మ్ సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులు పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదన్నారు. చెరువులను పునరుద్దరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
HMDA Website: హైదరాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా హడల్ కనిపిస్తోంది. హైదరాబాద్‌లో చాలా వరకు చెరువులు, కాల్వలు, అప్రోచ్ కాల్వలను రియల్టర్లు లేఅవుట్‌లుగా మార్చి విక్రయిస్తున్నారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీపై, మన పార్టీపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షాలు నన్ను, నా కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఫాం హౌస్ ను పావుగా వాడుకోవడం.. నాకు తీవ్ర మనోవేదన కలిగిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. మా ఫాం హౌస్ లో ఏ కట్టడమూ ఎఫ్‌టీఎల్,బఫర్ జోన్ పరిధిలో లేవు.. ఏ కట్టడమైనా ఒక్క అంగుళం మేరకు ఉన్నా.. నా సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.
మూసీ బఫర్ జోన్, FTL ను ఎక్కడ ముట్టుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రజలకు 10వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని కేటీఆర్ అనాడు ప్రకటించారని, అధికారంలో ఒకేలా! అధికారం కోల్పోతే మరోలా మేము మాట్లాడమన్నారు. మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతుంది…అక్రమ కట్టడాలు అయినా వాళ్లకు మునరావాసం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు రింగ్ రోడ్డు 7వేల కోట్లకు అమ్ముకున్నది గత BRS కాదా!…