Bombay High Court: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌కు సమాధానం ఇచ్చింది. పీఓకే, పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే, మన దేశంలో కొంత మంది మాత్రం దీనిని సమర్థించకుండా, ‘‘ఆపరేషన్ సిందూర్’’కు వ్యతిరేక పోస్టులు పెడుతూ, పాకిస్తాన్ ప్రేమను చూపించారు. ఇలాంటి కేసును విచారిస్తున్న బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Yanamala Rama Krishnudu: భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వైఎస్సార్సిపికి అనుకూలంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము సీనియర్ సంపాదకులమంటూ సమావేశంలో పాల్గొన్న మీడియా ప్రతినిధులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో వైఎస్సార్, జగన్ ప్రభుత్వాల హయాంలో మీడియా స్వేచ్ఛను తీవ్రంగా హరించినప్పుడు ఈ సోకాల్డ్ సంపాదకులు ఏమైపోయారని ప్రశ్నించారు. Read Also: Buggana Rajendranath: ప్రజలకు ఇచ్చిన…
ఓయూలో నిర్భంద ఆంక్షలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల చేయడం కలకలం రేపుతోంది. నేటి పాలకుల విధానాల వలన మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ ధ్వజమెత్తింది. ఈ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని మండిపడింది.
Thammineni Veerabhadram : ‘వీక్షణం’ సంపాదకులు ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. తమకు నచ్చని పుస్తకాన్ని అమ్ముతున్నారనే పేరుతో వేణుగోపాల్ పై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద పరిశోధనలు జరిపిన ఒక చరిత్రకారుడు, అది పూర్వం బౌద్ధక్షేత్రం అనీ, దానికి ఆధారాలున్నాయని 40 సంవత్సరాల క్రితం పుస్తకం విడుదల చేశారని,…
బంగ్లాదేశ్‌లో మహిళా టీవీ జర్నలిస్ట్ సారా రహ్మునా(32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రాజధాని ఢాకాలోని హతిర్‌జీల్ సరస్సు నుంచి బుధవారం ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా కథనాలు తెలిపాయి.
సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్)కు చెందిన కొన్ని అకౌంట్లను నిలిపివేయాలని కోరుతూ భారత సర్కార్ ఆదేశాలు జారీ చేసిందని ఆ సంస్థ పేర్కొనింది. ప్రత్యేకమైన అకౌంట్ల నుంచి జరిగే పోస్టులను కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎలాన్ మాస్క వెల్లడించారు.
France: ఫ్రాన్స్‌తో పాటు బెల్జియం, ఇతర యూరోపియన్ దేశాల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరుగుతోంది. పలువురు ఆయా దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే 2020లో ఫ్రెంచ్ ఉపాధ్యాయుడు శామ్యూల్ పాటీని తల నరికి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ కేసులో ఆరుగురు టీనేజర్లను ఫ్రెంచ్ కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది.
ప్రజా ప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పరిమితులు విధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించాలని.. ప్రజా ప్రతినిధులు చేసే విద్వేష వ్యాఖ్యల వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలైంది.