Yanamala Rama Krishnudu: భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వైఎస్సార్సిపికి అనుకూలంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము సీనియర్ సంపాదకులమంటూ సమావేశంలో పాల్గొన్న మీడియా ప్రతినిధులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో వైఎస్సార్, జగన్ ప్రభుత్వాల హయాంలో మీడియా స్వేచ్ఛను తీవ్రంగా హరించినప్పుడు ఈ సోకాల్డ్ సంపాదకులు ఏమైపోయారని ప్రశ్నించారు.
Read Also: Buggana Rajendranath: ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం.. మాజీ మంత్రి ఫైర్..!
ఇప్పుడు మాత్రం భావ ప్రకటనా స్వేచ్ఛ పేరిట వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ నాడు కొన్ని తదితర పత్రికలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తే వీరెవ్వరూ ఎందుకు స్పందించలేదు?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నప్పుడు మీడియా వాచ్ లాంటి నల్లచట్టాలను తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, గతంలో ఓ మీడియా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉండటమే కాక, ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారానికి పాల్పడిందన్నారు.
Read Also: MLA Putta Sudhakar: తాగునీటి సమస్యకు పరిష్కారంగా అలగనూరు రిజర్వాయర్..!
ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వ్యక్తిత్వ హనన వ్యాఖ్యలు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకు రాదని గుర్తించాలి. రూల్ ఆఫ్ లా అన్నది ఆ యాజమాన్యానికి వర్తించదా? అని యనమల ప్రశ్నించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఉల్లంఘించిన నాటి వైఎస్, జగన్ ప్రభుత్వాలపై ఈ సంపాదకులు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు వైస్సార్సీపీ అనుకూల మీడియా ఇప్పటికీ అధికార కోల్పోయిన తర్వాత కూడా ప్రజా ప్రతినిధులను అవమానించే విధంగా దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఇదంతా భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఎలా వస్తుంది? అసలు ప్రాథమిక విలువలపై ఈ సమావేశాల ద్వారా ఎలాంటి సందేశం వెళ్లుతోంది? అంటూ యనమల తన అభ్యంతరాలను స్పష్టంగా వ్యక్తపరిచారు.