Fraud: హిందువుగా నటించి ఓ మహిళని పెళ్లి చేసుకున్న తర్వాత మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 35 ఏళ్ల వ్యక్తి హిందువుగా చెప్పుకుంటూ మోసం చేశాడు. ఆ తర్వాత ఇస్లాంలోకి మారాలని సదరు మహిళని బలవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీలో…
మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సోసైటీ 100 ఫీట్ రోడ్ లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీని కేటుగాళ్లు నిర్వహించారు. కన్సల్టేషన్ కంపెనీ దాదాపు 600 మందికి పైబడిన నిరుద్యోగుల నుంచి రూ.1లక్ష , రూ. 50,000 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది.
Telangana High Court: ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములుగా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ స్పష్టం చేశారు. కాప్రా మాజీ తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మాజీ సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కాప్రా మండల సర్వేయర్ శ్రీష్మా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లపై కేసు నమోదు చేయాలని…
ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన 38 ఏళ్ల వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని ఖమ్మం యెల్లందు పట్టణానికి చెందిన బిందె పవన్ కళ్యాణ్‌గా గుర్తించారు. ఫిబ్రవరి 8, 2024న హైదరాబాద్‌కు చెందిన 45 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటపడింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, అతనికి లాభదాయకమైన ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ఉద్యోగాన్ని అందజేస్తూ కాల్ వచ్చింది. ఆఫర్ నిజమైనదని నమ్మి,…
ఓ ప్రబుద్ధుడు తాను ఐఏఎస్ ఆఫీసర్‌ని అంటూ యువతిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకోవడంతో పాటు.. ఆమె వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు. మళ్లీ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశారు కేటుగాళ్లు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్పను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని ఎంపీడీవోకు నిందితులు ఫోన్ చేశారు. ఏసీబీలో తనపై కేసు నమోదు అవుతుందని ఎంపీడీవోను ఆగంతుకులు బెదిరించారు.