హైదరాబాద్ లో వెలుగు భారీ మోసం వెలుగు చూసింది. 700 కోట్ల రూపాయలు కాజేసి బోర్డు తిప్పేసింది డీకేజెడ్ (DKZ) టెక్నాలజీస్ సంస్థ. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ.. పెట్టుబడులు సేకరించింది. హైదరాబాద్ వ్యాప్తంగా 18 వేల మంది బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. వందలాది బాధితులు.. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. మీడియాకు తమ బాధను తెలుపుకునేందుకు బారులుదీరారు.
READ MORE: Port Blair renamed: “పోర్ట్ బ్లెయిర్” పేరు మార్చిన కేంద్రం..ఇకపై ఇలా పిలవాలి..
ఒక్క హైదరాబాద్ లోనే 18 మంది బాధితులు ఉన్నట్లు తెలిసింది. బషీరాబాగ్ లోని సీసీఎస్ కార్యాలయానికి బాధితులు చేరుకున్నారు. 3 రాష్ట్రాల్లో 55 వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ ముందు ఇన్వెస్టర్లను నమ్మించేందుకు తొలుత లాభాలు చూయించింది. ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల అకౌంట్ లో డబ్బులు జమయ్యాయి. తీరా 700 కోట్ల రూపాయల వరకు దండుకుని పరారయ్యారు కేటుగాళ్లు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తో ప్రమోషన్లు చేయించి మోసానికి పాల్పడ్డారు. లాభాలు వస్తుండటంతో.. పలువురు అప్పు చేసి, గోల్డ్ అమ్మి పెట్టుబడి పెట్టారు. బాధితులంతా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు.