FIFA World Cup: ఎలాంటి అంచనాలు లేకుండా మొరాకో జట్టు ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో అడుగుపెట్టింది. భారీ అంచనాలు పెట్టుకున్న జట్లను సైతం ఓడించి సెమీ ఫైనల్ కు చేరింది. కానీ, బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది.
France End Morocco's Dream FIFA World Cup Run To Set Up Final Clash With Argentina: ఖతార్ వేదికగా జరగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. టోర్నీ ఆద్యంతం ఆధిప్యతం ప్రదర్శించిన మొరాకోను మట్టికరిపించింది ఫ్రాన్స్. అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ గెలుచుకునేందుకు ఒక అడుగు దూరంలో నిలిచింది. కప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మొరాకో ఆశలపై ఫ్రాన్స్ నీళ్లు చల్లింది. ఆదివారం అర్జెంటీనాతో తలపడననుంది ఫ్రాన్స్. హోరాహోరీగా…
FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండో రోజు కూడా సంచలనం నమోదైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను పసికూడ సౌదీ అరేబియా ఓడించి చరిత్ర సృష్టించింది. బుధవారం కూడా మరో సంచలనం నమోదైంది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో జపాన్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ భాగం ముగిసే సరికి జర్మనీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.…
UK, France back UNSC permanent seat for India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతసభ్య దేశం కోసం భారత్ చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. వంద కోట్ల కన్నా అధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి శాశ్వత సభ్య దేశం హోదా ఇవ్వకుంటే భద్రతా మండలికి అర్థమే ఉండదని పలుమార్లు భారత్ వ్యాఖ్యానించింది. భద్రతా మండలిని సంస్కరించాలని చాలా ఏళ్లుగా భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.
Emmanuel Macron To Visit India Early Next Year: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుమేల్ మక్రాన్ భారత పర్యటనకు రాబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన భారతదేశాన్ని సందర్శించేందుకు రానున్నారు. ఫ్రెంచ్ మంత్రి క్రిసౌలా జచరోపౌలౌ, భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మాక్రాన్ 2023 ప్రారంభంలో భారతదేశాన్ని సందర్శించాల్సి ఉందని అన్నారు. మహారాష్ట్రలోని జైతాపూర్ అణువిద్యుత్ రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించి పునరుద్ధరణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇండియాకు…
ఉక్రెయిన్‌లో రష్యా నెలల తరబడి యుద్ధం సాగిస్తున్న వేళ… గురువారం కీలక పరిణామం చోటుచేసుకొంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, రొమేనియా అధ్యక్షుడు క్లాస్ ఐహానిస్‌లు రైలులో రాజధాని కీవ్‌కు వచ్చారు. ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తామని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రొమేనియా అధినేతలు మరోసారి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ వెంటే ఉంటామని ఉద్ఘాటించారు. వారు గురువారం అనూహ్యంగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈయూలో చేరాలన్న…
మంకీపాక్స్ వైరస్ కలకలంరేపుతోంది. ఇప్పటికే దాదాపు 50కి పైగా దేశాలకు విస్తరించింది. సుమారు 700 కిపైగా కేసులు బయట పడ్డాయి. మంకీపాక్స్ పేరు వినగా ప్రజలంతా జంకిపోతున్నారు. ఇక ఈవైరస్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. ఈ యూరోపియన్ దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో వెలుగు చూసింది.…