FIFA World Cup: సెమీస్ లో ఓడిన మొరాకో.. బీభత్సం సృష్టించిన అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup: ఎలాంటి అంచనాలు లేకుండా మొరాకో జట్టు ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో అడుగుపెట్టింది. భారీ అంచనాలు పెట్టుకున్న జట్లను సైతం ఓడించి సెమీ ఫైనల్ కు చేరింది. కానీ, బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. దీంతో తమ జట్టు ఫైనల్‌కు చేరి కప్పు కొడుతుందనుకున్న మొరాకో అభిమానుల కలలు చెదిరిపోయాయి. ఫ్రాన్స్ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ తర్వాత బ్రస్సెల్స్ వీధుల్లో వారు బీభత్సం సృష్టించారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో అభిమానులు వీరంగం హింసకు దారి తీసింది. దాదాపు వంద మంది అల్లర్లకు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చెత్తను ఒక్క దగ్గరికి చేర్చి నిప్పు పెట్టారు.
Read Also: Indian Air Force : ముగిసిన రఫెల్ డీల్.. ఇండియాకు చేరుకున్న ఆఖరి విమానం
Also Read

పోలీసులు భాష్పవాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఫలితం లేదు. ఈ క్రమంలో పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లలో ఫ్రాన్స్ అభిమానుల కారు ఢీకొనడంతో ఓ బాలుడు చనిపోయాడు. పోలీసులపైకి పటాకులు, ఇతర వస్తువులు విసిరేశారు. దీంతో పరిస్థితి మించకుండా ఉండేందుకు పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. వాటర్ క్యానన్లతో ఆభిమానులను చెదరగొట్టారు. బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్‌లో మొరాకోపై 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. ఆధ్యంతం హోరాహోరాగా సాగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జట్టులోని ఆటగాళ్ల ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో మొరాకో ఒక్కగోలు కూడా చేయకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!