రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. బలమైన రష్యా ముందు కేవలం వారాల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ రష్యాకు ఎదురొడ్డి పోరాడుతోంది. అయితే అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు సైనికంగా, వ్యూహాత్మకంగా సాయపడటంతో ఉక్రెయిన్ ఆర్మీ ఎదురునిలిచి పోరాడుతోంది. ఇదిలా ఉంటే జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా చేయడానికి…
ఈ ఏడాది తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మే 2 నుంచి మూడు రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి డెన్మార్క్ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో మే 4న ప్యారిస్ చేరుకుంటారు. ఈ మేరకు మోదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇండియా జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్…
ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించగా, ఉక్రెయిన్‌కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు మోహరించాయి. ఉక్రెయిన్ ను అక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, రష్యాకూడా ఇదే విధంగా చెబున్నది. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సోవియట్ యూనియన్ ఒప్పందాలకు విరుద్దంగా నాటో దేశాలు, అమెరికా ప్రవర్తిస్తే తగిన చర్యలు…
ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. ఉక్రెయిన్ సంక్షోభం నివారించేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని అమెరికా చెబుతున్నది. ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కొన్ని పరిష్కారాలను సూచిస్తూ రష్యాకు లేఖ రాసింది అమెరికా. అయితే, దీనిపై రష్యా ఇంకా స్పందించలేదు. సోవియట్ యూనియన్ దేశాల నుంచి విడిపోయిన దేశాలకు నాటోలో చేర్చుకోకూడదు అన్నది రష్యా వాదన. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించి నాటోలో చేర్చుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే,…
సాధారణంగా మన బరువుకంటే ఎత్తైన రాళ్లను ఎత్తాలి అంటే కొంత కష్టమే. ఎంతటి బలం ఉన్న వ్యక్తులైనా సరే కొంత మేరకు మాత్రమే బరువులు ఎత్తగలుగుతారు. అయితే, ఫ్రాన్స్‌లోని హ్యూల్ గేట్ అనే అటవీ ప్రాంతంలో 1.37 టన్నుల బరువైన ఓ పెద్ద బండరాయి ఉన్నది. దానిని ఎవరైనా సరే ఈజీగా ఎత్తివేయవచ్చట. సమతల కోణంలో ఉన్న ఆ రాయిని ఒక పక్కగా ఎత్తితే కొద్దిగా కదులుతుంది. అంతేకాదు, ఇంకాస్త ప్రయత్నిస్తే ఆ రాయిని పూర్తిగా…
ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ కేసులతో అల్లకల్లోలంగా మారింది. కరోనా ధాటికి యూరప్, అమెరికా దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలు రోజువారీ కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌లో మరో కొత్త వేరియంట్ పుట్టుకువచ్చింది. కొత్త వేరియంట్ బి.1.640.2 గా గుర్తించారు. కామెరూన్ నుంచి వచ్చిన వారి ద్వారా ఈ వేరియంట్ ఫ్రాన్స్‌లోకి ప్రవేశించింది. Read: ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ… ఇప్పటికే…
అర్జెంటీనాకు చెందిన పుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ కరోనా బారిన పడ్డాడు. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా కరోనా సోకినట్లు సమాచారం అందుతోంది. జర్మన్ క్లబ్ పీఎస్‌జీ తరఫున ఆడుతున్న మెస్సీ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ కప్‌లో ఆడుతున్నాడు. సోమవారం వాన్నెస్ జట్టుతో పీఎస్‌జీ జట్టు తలపడాల్సి ఉంది. అయితే మెస్సీ కరోనా వైరస్ బారిన పడటంతో ఆ జట్టు ఆందోళనకు గురవుతోంది. ప్రస్తుతం మెస్సీ సెల్ఫ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు.…
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది నాటికి 100 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారబోతున్నదా అంటే అవుననే చెబుతున్నాయి గణాంకాలు. ఈ ఏడాది 194 దేశాల ఆర్థిక వ్యవస్థలు 94 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, వచ్చే ఏడాదికి 100 ట్రిలియన్ డాలర్లుగా మారొచ్చని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తెలియజేసింది. మొదట 2024లో 100 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసినా, దానికంటే ముందే ఈ మార్క్‌ను చేరుకోబోతుందనే వార్తలు రావడం విశేషం.…