France End Morocco’s Dream FIFA World Cup Run To Set Up Final Clash With Argentina: ఖతార్ వేదికగా జరగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. టోర్నీ ఆద్యంతం ఆధిప్యతం ప్రదర్శించిన మొరాకోను మట్టికరిపించింది ఫ్రాన్స్. అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ గెలుచుకునేందుకు ఒక అడుగు దూరంలో నిలిచింది. కప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మొరాకో ఆశలపై ఫ్రాన్స్ నీళ్లు చల్లింది. ఆదివారం అర్జెంటీనాతో తలపడననుంది ఫ్రాన్స్. హోరాహోరీగా జరిగి సెమీఫైనల్ మ్యాచులో ఫ్రాన్స్ 2-0తో మొరాకోను ఓడించింది. థియో హెర్నాండెజ్, రాండల్ కోలో మువానీ చేసిన గోల్‌లతో ఫ్రాన్స్ మొరాకో ప్రపంచ కప్ కలను చెరిపేసింది. ఏడు ఎడిషన్లలో ఇది ఫ్రాన్స్ నాలుగు సార్లు ఫైనల్ కు చేరింది. మెస్సీతో కూడిన అర్జెంటీనా జట్టుపై గెలిచి వరల్డ్ కప్ సాధించాలని ఫ్రాన్స్ భావిస్తోంది.
Read Also: Bandi Sanjay : రేపు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ.. హజరుకానున్న జేపీ నడ్డా
గ్రూప్ దశలో బెల్జియంను ఓడించి, స్పెయిన్, పోర్చుగల్‌లను ఓడించి మొరాకో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. బలమైన జట్లను ఓడిస్తూ సెమీస్ కు చేరుకుంది మొరాకో. ఆఫ్రికా నుంచి సెమీస్ చేరుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. మ్యాచ్ ఆద్యంతం ఇరు జట్టు హోరాహోరీగా పోరాడాయి. మ్యాచ్ మొత్తంలో ఎక్కువ సమయంలో బాల్ మొరాకో జట్టు ఆధీనంలో ఉన్నప్పటికీ.. ఫ్రాన్స్ ఢిపెన్స్ ను దాటుకొని గోల్ చేయలేకపోయింది. పదేపదే ఫ్రాన్స్ గోల్ పోస్టుపై దాడి చేసినప్పటికీ.. ఫ్రాన్స్ ఢిపెన్స్ ను ఛేదించలేకపోయింది. మ్యాచ్ ప్రారంభం అయిన 5వ నిమిషంలోనే ఫ్రాన్స్ ఆటగాడు థియో ఫెర్నాండెస్ ఫ్రాన్స్ తరుపున అద్భుతమైన గోల్ చేశాడు. దీంతో ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తరువాత మొరాకో ఆటగాళ్లు పలుమార్ల గోల్ చేయడానికి ప్రయత్నించినా.. విఫలం అయ్యారు. 79వ నిమిషంలో రాండల్ కోలో మువానీ మరో గోల్ చేయడంతో ఫ్రాన్స్ 2-0తో మొరాకోపై విజయం సాధించింది.