ప్రధాని మోడీ సోమవారం రెండు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఫ్రాన్స్, అమెరికాలో మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఏఐ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు.
Pakistan: ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. రొటేషన్ పద్ధతిలో పాక్ కు ఈ ఛాన్స్ వచ్చింది.
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గత వారం ఫ్రాన్స్ క్షిపణి దాడులు నిర్వహించిందని ఫ్రెంచ్ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను మంగళవారం తెలిపారు.
ఫ్రాన్స్‌లో 'చిడో' తుఫాను విధ్వంసం సృష్టించింది. మయోట్ ప్రాంతంలో తుఫాను కారణంగా వందలాది మంది మరణించారు. అణుదాడి తర్వాత జరిగిన విధ్వంసంలా చాలా ప్రాంతాల్లో విధ్వంస దృశ్యాలు నెలకొన్నాయి. తుఫాను దాటికి చాలా రోజులుగా తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరకని దుస్థితి ఏర్పడింది. అలాగే.. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. మృతుల సంఖ్య వేలకు చేరుకోవచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు.
తాను అధికార బాధ్యతల నుంచి తప్పుకోను.. త్వరలోనే కొత్త ప్రధాన మంత్రిని నియమిస్తానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఎలిసీ ప్యాలెస్ నుంచి ఫ్రాన్స్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మీరు ఐదేళ్లు పాలించమని నాకు అధికారం ఇచ్చారు.. అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తాను.. ప్రజలను రక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసకెళ్లే బాధ్యత నాపై ఉందని మెక్రాన్ చెప్పుకొచ్చారు.
ఫ్రాన్స్‌లో మితవాద, అతివాద చట్ట సభ్యలు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్, ఆయన మంత్రివర్గంపై ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి మిచెల్ బార్నియర్ ప్రభుత్వం ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో విశ్వాస ఓటింగ్‌లో ఓడిపోయింది.
A Indian did Love Marriage With French woman: తమిళనాడులోని తేని జిల్లా ముత్తుదేవన్‌పట్టికి చెందిన భోజన్, కాళియమ్మాళ్ దంపతుల కుమారుడు కళైరాజన్. ప్రభుత్వ రవాణా సంస్థలో కండక్టర్‌గా పనిచేసిన భోజన్ మృతి చెందగా, కలైరాజన్ 2017లో ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లి చదువు కొనసాగించాడు. అక్కడ, కలైరాజన్ మరియం అనే ఫ్రెంచ్ మహిళతో చేసిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ విషయాన్ని ఇరువురు వారి కుటుంబ సభ్యులకి తెలిపారు. ఆ తర్వాత…
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇతర సీనియర్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
సోమవారం నుంచి రెండు రోజులపాటు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అక్కడి కీలక అధికారులతో ఆయన భేటీలో రాఫెల్ డీల్ ప్రధాన అజెండాగా ఉంటుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క బిడ్‌కు యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చాయి. తాజాగా భూటాన్, పోర్చుగల్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది.