ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామంలో అందరినీ కలిచివేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి గత నాలుగేళ్లలో గ్రామంలోని సుమారు 80 పశువులకు విషమిచ్చి చంపేశాడు. అతను నిశ్శబ్దంగా ప్రజల ఇళ్లలోని పశువుల కొట్టంలోకి ప్రవేశించి, ఆవులు, ఎద్దులకు విషం పెట్టి అక్కడి నుంచి పారిపోయే వాడు. గ్రామంలో పశువులకు అంటువ్యాధి వచ్చిందని మొదట్లో ప్రజలు అనుకున్నారు. దీంతో ఆవులు, ఎద్దులు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఓ రైతు ఇంట్లో…
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ పెరగటంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించిన డీపీఆర్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టి రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని…
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జమ్మూ, కశ్మీర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్నీ అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యావిధానం-2020ని అనుసరించి, ఉన్నత విద్యలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, అప్పటివరకు విద్యార్థులు చూపిన…
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు మెట్రోరైలు అడుగుపెట్టింది. ప్రయాణికుల సమయం ఆదా చేయడం, కాలుష్యం తగ్గించడం, సౌర విద్యుత్ వినియోగం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రవేశించింది. ఈ నేపథ్యంలో తన పరుగులు మొదలుపెట్టి హైదరాబాద్ మెట్రో నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు తొలిదశ ప్రారంభమైంది. మొత్తం మూడు మార్గాల్లో నాలుగు దశల్లో మొత్తం…