జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి (NH)44పై దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు రూ.1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడ్లకోయ జంక్షన్ సమీపంలో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి…
హైదరాబాద్ నగరంలోని తార్నాకలోని CSIR - IICT లో సైన్స్ సిటీ సెంటర్ కు సైన్స్ & టెక్నాలజీ మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్ తో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
సార్వత్రిక ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా మరిన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆయా రైల్వేస్టేషన్లు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి.
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్‌జీ గోండు పోరాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందన్నారు.
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మల్లన్న పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రధాని మోడీ (PM Modi) ఆదేశించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి శ్రీశ్రీశ్రీ పూజ్య గురువులు గణపతి సచ్చిదానంద స్వామీజీ శంకుస్థాపన చేశారు.
వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్ట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేయడానికి ములుగు జిల్లానే స్ఫూర్తి అని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.