ఈనెల 6న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు. రూ.24,470 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కేంద్రం ఈ పనులకు చేపడుతోంది.
Minister KTR: వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటలో గల కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్‌గోన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ లోని కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆ తర్వాత రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ…