తాను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయా ఛానళ్లు తమ వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ ఎలా ఉంటే అలా ఉంటానని స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి దిగజారుడు మాటలు తగవు అంటూ పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు.. ఇక, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించిన ఆయన… అలాగే ఓ రాజకీయ నేత ఎలా ఉండకూడదో పవన్ కల్యాణ్‌ని చూసి నేర్చుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఆరు…