అమెరికా-వెస్టిండీస్ లో జూన్ 2న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కాగా.. ఈ మెగా టోర్నీలో సెమీ ఫైనల్ కు వెళ్లే నాలుగు జట్ల గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ జోస్యం చెప్పాడు. అయితే.. ఆ జట్లలో టీమిండియాకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం. సోషల్ మీడియా వేదికగా అతడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైస్ కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా ఉన్నారు. ఒకవేళ ఫ్యూచర్లో అవకాశాలు వస్తే.. సీనియార్టీ ప్రకారం బుమ్రా, హార్దిక్ పాండ్యా, రాహుల్ లాంటి వారు ఉన్నారు. వారినీ కాదని.. టీమిండియా స్టార్ ప్లేయర్కు ఫ్యూచర్ కెప్టెన్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఓటేశారు.