ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మంగపేట మండలం చుంచపెల్లి వద్ద గోదావరి నది దాటి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మల్లూరు లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం వైపు వెళ్లి ఉంటుందని అంచనాకి వచ్చారు. చుంచుపల్లి, పాలయిగూడెం, ఓడగుడెం, మల్లూరు, నిలాధ్రిపేట, బాలన్నగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. పులి…
కొమురం భీం జిల్లా అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వచ్చిన ఏనుగు మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర నుండి ప్రాణహిత సరిహద్దు 30 కిలోమీటర్ల దూరంలో రెండు రోజుల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు.
నంద్యాల జిల్లాలో గత మూడు నెలలుగా సంచరిస్తున్న చిరుత పులి కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలించారు. పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. అయితే, నిన్న రాత్రి పచ్చర్ల సమీపంలో బోనులో చిరుత చిక్కుకుంది.
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లాం తుంగెడ గ్రామ శివారులోని 417 కంపార్ట్‌మెంట్‌లో అటవీశాఖ అధికారులకు, వరి రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం మరువక ముందే మరో వివాదం తలెత్తింది. దానాపూర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం చేశారు. పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. న్యాయం చేయాలంటూ రోడ్డుపై రైతుల నిరసన తెలిపారు. దశాబ్దాలుగా తాము…
నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జంగు బాయి జాతర నేపథ్యంలో కెరమెరి మండలం గొండి గ్రామ పరిధిలో గల జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క సందర్శించారు.
రైలు ఢీకొని రెండు మొసళ్లు చనిపోయిన ఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌లో జరిగింది. బగాహా-వాల్మీకినగర్ రోడ్ రైల్వే స్టేషన్ మధ్య మంగళ్‌పూర్ ఔసాని హాల్ట్ సమీపంలో మొసళ్లను రైలు ఢీకొనడం కనిపెట్టారు. దీంతో వెంటనే రైల్వే సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.
ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీ రాష్ట్రం మీరట్‌లోని షాజన్‌పూర్‌లో ఓ మామిడి తోటలో ఓ పదేళ్లబాలుడు పెంపుడు కుక్కతో ఆడుకున్నట్లు చిరుత పిల్లతో ఆటలాడుతున్నాడు. ఆ చిరుత కూన మెడలో తాడు కట్టి ఉంది.. ఆ కూన మామిడిచెట్టు కింద ఉండగా బాలుడు దాన్ని పట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కిష్టారం గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలే వానలతో అల్లాడుతున్న జనాలకు గ్రామంలో కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. అసలే చీకటి, ఆపై వర్షం.. ఆరాత్రి నిద్రలోకి జారుతున్న జనాలకు ఉలిక్కిపడేలా చేసింది.