విజయవాడలో చెత్తపన్ను వసూలు చేయలేదని ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. 48, 57వ వార్డు సచివాలయాల్లో శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు చెన్నకృష్ణ, సలీమ్ బాష టార్గెట్ మేరకు చెత్తపన్ను వసూలు చేయడంలో విఫలం అయ్యారని విజయవాడ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇద్దరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెత్త పన్ను వసూళ్లల్లో నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చెత్త పన్నును వసూలు చేయాలని మున్సిపల్…