Bengaluru: 8 ఏళ్ల వయసున్న బాలిక చెప్పిన అబద్ధం, తప్పుడు ఆరోపణ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ప్రాణాలు మీదికి తీసుకువచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్ తనను బలవంతంగా టెర్రస్ పైకి తీసుకెళ్లాడని చెప్పడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, అపార్ట్మెమెంట్ లోని ప్రజలు చితకబాదారు. ఈ ఘటన బెంగళూర్ లోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. అయితే, బాలిక ఒంటరిగా టెర్రస్ పైకి వెళ్లినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన…