గత ఐదు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రాజధాని హైదరాబాద్ లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు, వరద ప్రభావం, సహాయక చర్యలు వంటి అంశాలపై అధికారుల ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.
Read Also: నటిపై అత్యాచారం.. బీర్ బాటిల్ ను ప్రైవేట్ పార్ట్ లోకి.. ?
ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు ఆయా ప్రాంతాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే భద్రాచలం దగ్గర వరద పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ తో సీఎం కేసీఆర్ పోన్లో మాట్లాడి భద్రాచలం దగ్గర వరద పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తిని అనుసరించి అందుకు అనుగుణంగా రైతులకు లాభం చేకూర్చే దిశగా అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు తదితర అంశాలపై ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ దామోదర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ శాంతకుమారి, సీఎంఓ అధికారులు, సంబంధిత శాఖాధికారులు హాజరైయ్యారు.
Read Also: Mohammad Hafeez: పాకిస్తాన్ కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ క్రికెటర్..!
గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం హైద్రాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్ ను తక్షణమే బయలుదేరి భధ్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్ర సచివాలయంతో పాటు, కలక్టరేట్ లో ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను.. ఎన్డీఆర్ ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కంట్రోల్ రూం సహా హెలీకాప్టర్లు సంబంధిత సహాయకచర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను చేసిన అధికార యంత్రాంగం, భధ్రాచలంలో సహాయక చర్యలకు సిద్ధమైంది.
Read Also: Sreemukhi: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప
రెవెన్యూ, పంచాయితీ రాజ్, వైద్యారోగ్యశాఖ, డిసాస్టర్ మేనేజ్మెంట్, సహా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందని కేసీఆర్ స్పష్టం చేశారు.