దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లోను రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ మిల్కీ బ్యూటీ హవా తెలియంది కాదు. సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్ అందాలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి తమన్నా పసందైన ఆహారాన్ని ఆరగిస్తుండటంతో తను ప్రయాణించాల్సిన విమానాన్ని అందుకోలేకపోయిందని షేర్ చేసింది. నూడిల్స్ ఫొటోను షేర్ చేస్తూ.. నేను ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అవడానికి కారణం ఇదే.. అంటూ బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోను పంచుకోంది. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ‘సీటీమార్’ సినిమాను పూర్తి చేసిన ఆమె.. ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘మ్యాస్ట్రో’, ‘ఎఫ్ 3’ సినిమాల్లోను నటిస్తోంది.